ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. ముంబయిలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి జరగాల్సిన మ్యాచ్‌లపై సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అజహర్.. బీసీసీఐని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లపై బీసీసీఐకి ఆఫర్ - Hyderabad cricketassociation
అవకాశమిస్తే హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల్ని సురక్షిత వాతావరణంలో జరుపుతామని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ట్వీట్ చేశారు. దీనిపై బీసీసీఐ స్పందించాల్సి ఉంది.
"ఇలాంటి కష్టసమాయాల్లో మనం ఒకరికి ఒకరు తోడుగా నిలవాలి. సురక్షిత, సౌకర్యవంతంగా ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హామీ ఇస్తోంది" అని అజహరుద్దీన్ ట్వీట్ చేశారు.
శుక్రవారం, శనివారం.. ముంబయిలోని వాంఖడే మైదాన సిబ్బందిలో 10 మందికి, ఆరుగురు ఈవెంట్ మేనేజర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పాటు మహారాష్ట్రలోనూ రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ముంబయిలో షెడ్యూల్ ప్రకారం 10 మ్యాచ్‌లు జరుగుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆటగాళ్లు బయో బబుల్‌లో ఉన్నారని, అందువల్ల మ్యాచ్‌లు ఆటంకం లేకుండగా జరుగుతాయని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. మరి ఏమవుతుందో చూడాలి?