సీనియర్ స్పిన్నర్, దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్.. టీ20ల్లో అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగే మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీస్తే.. పొట్టి ఫార్మాట్లో 250 వికెట్లు మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా నిలుస్తాడు. ఐపీఎల్ ఇప్పటివరకు 139 వికెట్లు తీసిన అశ్విన్.. టీమ్ఇండియా తరఫున 52.. దేశవాళీ మ్యాచ్‌ల్లో మిగిలిన వికెట్లు పడగొట్టాడు.
ఐపీఎల్లో ఎక్కువ వికెట్లు తీసిన వారిలో మలింగ (170) అగ్రస్థానంలో ఉన్నాడు. అమిత్ మిశ్రా(160), పియూష్ చావ్లా(156), డ్వేన్ బ్రావో(154), హర్భజన్ సింగ్(150).. తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మలింగ తప్ప మిగిలిన వారందరూ ఇప్పటికీ లీగ్‌లో ఆడుతున్నారు.