తెలంగాణ

telangana

ETV Bharat / sports

AB de Villiers Sixes: ఇరగదీసిన ఏబీ డివిలియర్స్​.. 46 బంతుల్లో సెంచరీ!

ఐపీఎల్​-2021(IPL 2021) రెండో దశ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూఏఈ చేరుకున్న జట్లు ప్రాక్టీసు మొదలెట్టేశాయి. ఇక ఈసారైనా ట్రోఫీని ముద్దాడాలన్న ఆశయంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు నెట్స్‌లో(RCB Practice Today) తీవ్రంగా శ్రమిస్తున్నారు. గురువారం జరిగిన ఇంట్రాస్క్వాడ్​ మ్యాచ్​లో(RCB Practice Match) ఆర్సీబీ స్టార్​ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఏకంగా 46 బంతుల్లో సెంచరీ సాధించి.. అందర్ని ఆశ్చర్యపరిచాడు.

IPL 2021: AB de Villiers Hits Explosive Century In Royal Challengers Bangalore's Warm-Up Game
AB de Villiers Sixes: ఇరగదీసిన ఏబీ డివిలియర్స్​.. 46 బంతుల్లో సెంచరీ!

By

Published : Sep 15, 2021, 8:42 PM IST

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్​(IPL 2021) ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్లన్నీ ప్రాక్టీస్​ ముమ్మరం చేశాయి. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఓ ప్రాక్టీస్​ మ్యాచ్​నూ(RCB Practice Today) గురువారం ఆడింది. అందులో స్టార్​ బ్యాట్స్​మన్​ ఏబీ డివిలియర్స్​ చెలరేగాడు. హర్షల్​ పటేల్​, దేవ్​దత్​ పడిక్కల్​ జట్లుగా విడిపోయి ఆడిన మ్యాచ్​లో ఏబీడీ సిక్సర్ల(AB de Villiers Sixes) వర్షం కురిపించాడు. ఏకంగా 46 బంతుల్లో 104 పరుగులు చేసి అదరగొట్టాడు.

కోహ్లీ, సిరాజ్​, డాన్​ క్రిస్టియన్​, కైలీ జెమిసన్​ లాంటి స్టార్​ ఆటగాళ్లు క్వారంటైన్​లో ఉండగా.. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లతో మ్యాచ్​ను నిర్వహించింది ఆర్సీబీ ఫ్రాంఛైజీ. ఆర్సీబీ-ఏ టీమ్​కు హర్షల్​ పటేల్​ కెప్టెన్​గా వ్యవహరించగా.. టీమ్​-బీకి దేవ్​దత్​ పడిక్కల్​ సారథ్యం వహించాడు. ముందుగా టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న హర్షల్​ పటేల్​ టీమ్​.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు(RCB Intra Squad Match Scorecard 2021) చేసింది. డివిలియర్స్​​.. కేవలం 46 బంతుల్లో 104 పరుగుల(10 సిక్సర్లు, 7 ఫోర్లు)తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

అయితే లక్ష్య ఛేధనలో దేవదత్​ పడిక్కల్​ టీమ్​ మెరుగైన ప్రదర్శన చేసి.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులతో విజయం సాధించింది. పడిక్కల్​ జట్టులో కేఎస్​ భరత్​ 95 రన్స్​ చేసి నాటౌట్​గా నిలిచాడు. దీంతో డివిలియర్స్​ సెంచరీ వృథాగా మారింది. ఈ మ్యాచ్​కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. అయితే ఏదీ ఏమైనా ఆర్సీబీలో ఆటగాళ్లందరూ ఫామ్​లో ఉండడం.. ముఖ్యంగా ఏబీ డివిలియర్స్​ సూపర్​ సిక్సర్లతో అభిమానులు ఎంతో ఖుషీగా ఉన్నారు. ఈ ఐపీఎల్​లో ఆర్సీబీ ట్రోఫీ సాధించడం పక్కా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చూడండి..IPL 2021: గుడ్​న్యూస్​.. ఐపీఎల్​లో ప్రేక్షకులకు అనుమతి

ABOUT THE AUTHOR

...view details