భారత్‌లో కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో.. పలు దేశాలు ఇక్కడి పౌరులను అనుమతించడం లేదు. భారత్ నుంచి విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఆస్ట్రేలియా కూడా ఇదే బాటలో నడిచింది. మే 15 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. అయితే, ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత్‌లో చిక్కుకుపోయిన ప్రముఖ వ్యాఖ్యాత మైకేల్ స్లేటర్ మరోసారి ఆస్ట్రేలియా ప్రభుత్వం, ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ట్వీట్లు చేశాడు.
"మానవ సంక్షోభం గురించి ప్రధాని మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో ఉన్న ప్రతి ఆస్ట్రేలియన్ భయంతో ఉన్నాడన్నది నిజం! మీ ప్రైవేట్ జెట్లో వచ్చి ఇక్కడి వీధుల్లో ఉన్న మృతదేహాలను చూస్తే అర్థమవుతుంది." అని అన్నాడు.