ICC FTP 2023 to 2027: ఐసీసీ భవిష్య పర్యటన ప్రణాళిక (ఎఫ్‌టీపీ) క్యాలెండర్‌లో ఐపీఎల్‌కు అధికారికంగా ప్రత్యేక విండో లభించనుంది. అంటే ఐపీఎల్ జరిగే సమయంలో ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ ఉండదన్నమాట. దాదాపుగా సిద్ధమైన ముసాయిదా ఎఫ్‌టీపీ (2023-2027)లో ఐపీఎల్ కోసం రెండున్నర నెలలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌కు ఎఫ్‌టీపీలో అధికారికంగా చోటుంటుందని బీసీసీఐ కార్యదర్శి జైషా ఇంతకుముందే చెప్పాడు. ప్రపంచంలోనే ఖరీదైన ఈ క్రికెట్ లీగ్‌కు ఇప్పటివరకు మార్చి చివరి వారం నుంచి మే చివరి వారం వరకు అనధికారికంగా విండో ఉంది. ప్రస్తుతం ఐసీసీ రూపొందించిన ముసాయిదాలో దాన్ని జూన్ రెండో వారం వరకు పొడిగించినట్లు ఈఎస్‌పీన్‌క్రిక్‌ఇన్ఫో పేర్కొంది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా తమ ఆటగాళ్లను ఐపీఎల్ నిషేధించిన నేపథ్యంలో.. ఆ లీగ్‌కు ప్రత్యేకంగా చోటు కల్పించడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రజా అభ్యంతరం వ్యక్తం చేయొచ్చని భావిస్తున్నారు.
క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఇక రెండున్నర నెలలు సందడే సందడి! - అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ICC FTP 2023 to 2027: ఐపీఎల్ కోసం ఎఫ్‌టీపీ క్యాలెండర్‌లో రెండున్నర నెలలను ఐసీసీ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రోజులు కేటాయించడంపై బీసీసీఐకి ఇప్పటికే అనేక దేశాల మద్దతు లభించింది. విదేశీ ఆటగాళ్లు చాలా మంది ఐపీఎల్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో ఆర్జిస్తున్నారు.
అయితే ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రోజులు కేటాయించడంపై బీసీసీఐకి ఇప్పటికే అనేక దేశాల మద్దతు లభించింది. విదేశీ ఆటగాళ్లు చాలా మంది ఐపీఎల్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో ఆర్జిస్తున్నారు. ప్రతి విదేశీ ఆటగాడు కూడా తనకు వచ్చే మొత్తంలో పది శాతాన్ని తన బోర్డుకు ఇస్తున్నాడు. ఇప్పటికే చాలా అగ్రశ్రేణి క్రికెట్ దేశాలు ఐపీఎల్ సమయంలో ఎలాంటి సిరీస్‌లు పెట్టుకోవట్లేదు. ఐపీఎల్‌లా ద హండ్రెడ్ (ఇంగ్లాండ్), బిగ్‌బాష్ లీగ్‌లకు ప్రత్యేకంగా చోటు కల్పించే పరిస్థితి లేదు. అయితే ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియాలు రెండు దేశాల అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ లీగ్‌లలో ఎక్కువ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేలా.. షెడ్యూల్ ఉండేలా చూసుకోనున్నాయి. ద హండ్రెడ్‌కు జులై నుంచి ఆగస్టు వరకు మూడు వారాలు.. బీబీఎల్‌కు వచ్చే నాలుగేళ్లపాటు జనవరిలో విండో దక్కొచ్చు.
ఇదీ చూడండి :ఫైనల్లో పీవీ సింధు.. జపాన్ షట్లర్‌ను చిత్తుచిత్తుగా ఓడించి..