సన్రైజర్స్ రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ భవితవ్యంపై దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జెర్సీలో వార్నర్ కనిపించడం ఇదే చివరిసారి కావొచ్చని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఆడేముందు తుది జట్టు నిర్ణయంలో కెప్టెన్ పాత్ర కూడా ఉండాలని స్పష్టం చేశాడు.
"నాకు తెలిసి డేవిడ్ వార్నర్ ఆరెంజ్ జెర్సీలో కనిపించడం ఇదే చివరిసారి కావొచ్చు. ఆ ఫ్రాంఛైజీలో తెరవెనక ఏదో జరుగుతుంది. మనీశ్ పాండేను జట్టులోకి తీసుకోకపోవడంపై ప్రశ్నిస్తే ఏకంగా కెప్టెన్సీతో పాటు తుది జట్టు నుంచి తప్పిస్తారా? అక్కడ అంతకుమించి వివాదమేదో ఉంది."
-డేల్ స్టెయిన్, దక్షిణాఫ్రికా బౌలర్