ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పాక్ క్రికెటర్ వాహబ్ రియాజ్ ప్రశంసలు కురిపించాడు. ఈ మెగాటోర్నీని మించిన లీగ్ మరొకటి ఉండదని అన్నాడు. ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ క్రికెట్ లీగ్ అని పేర్కొన్నాడు. పీఎస్ఎల్తో పోలిస్తే ఐపీఎల్ స్థాయి వేరు అని చెప్పాడు.
ఐపీఎల్ స్థాయి వేరు: పాక్ పేసర్ - ipl praises by wahab riyaz
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సాటి రాగల క్రికెట్ లీగ్ ప్రపంచంలోనే మరొకటి లేదని పాక్ పేసర్ వాహబ్ రియాజ్ అన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌తో దానిని పోల్చలేమని చెప్పాడు.
"అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్లు ఐపీఎల్ ఆడతారు. పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చకూడదు. దాని స్థాయి వేరు. ఐపీఎల్ నిర్వాహకుల అంకితభావం, నిర్వహణ సామర్థ్యం, కమ్యూనికేషన్స్, ఆటగాళ్ల ఎంపిక అంతా భిన్నంగా ఉంటుంది. అందుకే దాని స్థాయి వేరు. ఐపీఎల్ తర్వాత స్థానం మాత్రం పీఎస్‌ఎల్‌దే. ఇందులో ఉన్న బౌలింగ్ ప్రమాణాలు ఐపీఎల్‌తో సహా ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవు. బౌలింగ్ దాడి వల్ల ఎక్కువ భారీ స్కోరు మ్యాచ్‌లు ఇందులో ఉండవు. ఈ రెండు లీగ్‌లకు బౌలింగ్ దాడి ఒక్కటి మాత్రమే తేడా" అని రియాజ్ చెప్పాడు.
ప్రస్తుతం ఐపీఎల్, పీఎస్ఎల్ కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడ్డాయి. మిగిలినా మ్యాచ్‌లను జూన్, సెప్టెంబరులో నిర్వహిస్తారని ప్రచారం సాగుతోంది.