చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫిట్నెస్ గురించి మాట్లాడాడు. జట్టులోని యువకులతో పోటీ పడటం చాలా కష్టమైన పని అని అన్నాడు. 39 ఏళ్ల వయసులోనూ తన ఫిట్నెస్ గురించి ఏ ఒక్కరూ వేలేత్తి చూపించకపోవడం తనకు పెద్ద సానుకూలత అని పేర్కొన్నాడు. వయసు పెరగడం, ఫిట్‌గా ఉండటం రెండు భిన్నమైన అంశాలని అభిప్రాయపడ్డాడు.
"ఒక వ్యక్తి ఆడుతున్నప్పుడు, తాను ఫిట్‌గా లేడని చెప్పించుకోవడానికి ఇష్టపడడు. యువ క్రికెటర్లతో పోటీ పడటం నిజంగా మంచిదే. ప్రతిసారి మంచి ప్రదర్శన ఇస్తామని కచ్చితంగా చెప్పలేం. అది 24 ఏళ్లప్పుడైనా.. 40 ఏళ్ల వయసులోనైనా. కానీ, ఇప్పటికీ ఫిట్నెస్ విషయంలో నావైపు జనాలు వేలేత్తి చూపించకపోవడమే నాకున్న అతి పెద్ద సానుకూల అంశం"
-ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్