ఐపీఎల్ ఆడుతున్న సమయంలో తన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడటం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, అందుకే లీగ్‌ను వీడాల్సి వచ్చిందని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు.
IPL2021: 8-9 రోజులు సరిగా నిద్రపోలేదు: అశ్విన్ - ఐపీఎల్ న్యూస్ లేటేస్ట్
తన కుటుంబ సభ్యుల కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల సరిగా నిద్రపోలేకపోయానని దిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అశ్విన్ అన్నాడు. అందుకే ఐపీఎల్‌ను అర్ధంతరంగా వీడాల్సి వచ్చిందని చెప్పాడు.

అశ్విన్
"మా ఇంట్లో దాదాపుగా అంతా కొవిడ్‌తో ఇబ్బందిపడ్డారు. సమీప బంధువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజులు లీగ్ అలాగే ఆడాను. 8 నుంచి 9 రోజులు సరిగా నిద్రపోలేదు. చాలా ఒత్తిడి అనుభవించాను. అందుకే అర్ధాంతరంగా లీగ్‌ను వీడాల్సి వచ్చింది. మా కుటుంబ సభ్యులు కోలుకున్నాక తిరిగి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే లీగ్ వాయిదా పడింది అని అశ్విన్ వివరించాడు.
ఇవీ చదవండి: