ఐపీఎల్లో భాగంగా ముంబయి వాంఖడే స్టేడియంలో ఈసారి 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. కానీ ఇప్పుడు 10 మంది మైదాన సిబ్బందితో పాటు ఆరుగురు ఈవెంట్ మేనేజర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అక్కడి మ్యాచ్‌లు జరుగుతాయా లేదా? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ జరగకపోతే, వాటిలో కొన్ని హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశముందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
"ఒకవేళ ఇక్కడ(ముంబయి) లాక్డౌన్ పెట్టినా సరే, జట్లు బయో బబుల్‌లో ఉన్నాయి. ప్రేక్షకుల్లేకుండానే మ్యాచ్‌లు జరుగుతాయి. కాబట్టి ముంబయిలో మ్యాచ్‌లపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. షెడ్యూల్ ప్రకారం ఇక్కడ చెన్నై-దిల్లీ జట్ల మధ్య ఏప్రిల్ 10న తొలి మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ పరిస్థితి చేయిదాటితే హైదరాబాద్, ఇండోర్ ప్రత్యామ్నయ వేదికలుగా ఉన్నాయి" అని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు.