తెలంగాణ

telangana

ETV Bharat / sports

అసోసియేషన్‌పై వస్తున్న వార్తల్లో వాస్తవంలేదు: అజారుద్దీన్‌ - Azharuddin Comments

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐని సంప్రదించామని అజారుద్దీన్‌ పేర్కొన్నారు. అయితే దీనిపై బీసీసీఐ స్పందించలేదని తెలిపారు. అసోసియేషన్‌పై వస్తున్న పుకార్లలో వాస్తవం లేదన్నారు.

AZAR
అసోసియేషన్‌పై వస్తున్న వార్తల్లో వాస్తవంలేదు: అజారుద్దీన్‌

By

Published : Mar 9, 2021, 7:25 PM IST

హైదరాబాద్‌లో ఐపీఎల్​ మ్యాచ్‌లు నిర్వహించకపోవడం విషయంలో బీసీసీఐని సంప్రదించినా ఎలాంటి స్పందన లేదని... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ హైదరాబాద్‌లో లేకపోవడం వల్ల... హెచ్​సీఏపై వస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. అండర్- 19, విజయ్ హజారే, ముస్తాక్ అలీ ట్రోఫీలకు సంబంధించి ఆటగాళ్ల ఎంపికలో హెచ్​సీఏ ప్రమేయం లేదని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.

అసోసియేషన్‌పై వస్తున్న వార్తల్లో వాస్తవంలేదు: అజారుద్దీన్‌

ABOUT THE AUTHOR

...view details