తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2023 : 'టెన్షన్​ పడొద్దు ఫ్యాన్స్'​.. కెప్టెన్స్ స్పెషల్​ ఫొటోలో​ రోహిత్​ మిస్సింగ్​కు కారణమిదే!

ఐపీఎల్​ 16వ సీజన్​ మరికొద్దిసేపట్లో ఆరంభం కానుంది. కప్​తో పాటు కెప్టెన్లు దిగిన గ్రూప్​ ఫొటోలో ముంబయి కెప్టెన్​ రోహిత్​ మిస్​ అయ్యాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే దానికి కారణమేంటంటే..

rohit sharma ipl
rohit sharma ipl

By

Published : Mar 31, 2023, 12:49 PM IST

అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ మరికొంత సేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌కు ముందు రోజు కెప్టెన్స్​తో ఓ స్పెషల్​ ఫోటోషూట్​ను నిర్వహించారు. దీనికి ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తప్ప మిగిలిన 9 జట్లకు చెందిన కెప్టెన్లు హాజరయ్యారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ అందుబాటులో లేనందున అతడి స్థానంలో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఈ షూట్‌లో పాల్గొన్నాడు. అయితే ముంబయిలో ఉండి కూడా రోహిత్​ ఈ షూట్​కు రాలేకపోయాడు.

రోహిత్​ గైర్హాజరుపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆయనకు గాయలయ్యాయన్న వార్తలు సైతం సోషల్​ మీడియాలో హల్​ చల్​ చేశాయి. అంతే కాకుండా ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు కూడా హిట్‌మ్యాన్ దూరంగా ఉండనున్నట్లు టాక్​ కూడా నడిచింది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే అవన్నీ నిజం కాదట.

ఐపీఎల్​ ఫొటోషూట్​

తాజాగా సమాచారం ప్రకారం అనారోగ్యం కారణంగానే రోహిత్​ ఈ ఫొటో షూట్​కు దూరమయ్యాడట. అంతే కాకుండా బెంగళూరుతో ఆదివారం జరగనున్న మ్యాచ్‌కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని స్పష్టమయ్యింది. అతడి ఆరోగ్య సమస్య కూడా చిన్నదేనని, ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

ప్రాక్టీస్​ మ్యాచ్​లో హిట్​ మ్యాన్​ అదుర్స్​..
ఆదివారం జరగనున్న మ్యాచ్​ కోసం రోహిత్​ సేన గట్టిగా కసరత్తులు చేస్తోంది. టీమ్​తో కలిసి సారథి రోహిత్​ శర్మ కూడా నెట్​లో ప్రాక్టిస్​ చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్ టైమ్​లో రోహిత్ తనదైన స్టైల్‌లో షాట్లు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలా లాఫ్టెడ్ షాట్‌తో అతడు సిక్సర్ బాదిన వీడియోను ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

గతేడాది ఐపీఎల్‌లో రోహిత్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. మొత్తం 14 మ్యాచుల్లో కేవలం 19.14 సగటుతో 268 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ సీజన్​లో జట్టు వరుసగా 8 ఓటములతో చెత్త రికార్డు కూడా సృష్టించింది.

ముంబయి తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, షామ్స్ ములానీ,ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, క్యామెరూన్‌ గ్రీన్‌, సూర్యకుమార్ యాదవ్, అర్జున్‌ తెందుల్కర్​, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండోర్ఫ్.

ముంబయి పూర్తి జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్, జోఫ్రా ఆర్చర్, రమణ్‌దీప్ సింగ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టియన్ స్టబ్స్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జేసన్ బెహ్రెండాఫ్, ఆకాష్ మధవాల్, కామెరూన్ గ్రీన్, జై రిచర్డ్‌సన్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్, షామ్స్ ములాని, నేహల్ వాధేరా, రాఘవ్ గోయల్

ABOUT THE AUTHOR

...view details