ఐపీఎల్(IPL 2021) రెండోదశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. టోర్నీలో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుపై(RCB Vs MI) 54 పరుగుల తేడాతో కోహ్లీసేన గెలుపొందింది. ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ హాఫ్‌సెంచరీ సహా మ్యాక్స్‌వెల్(Maxwell IPL News) ఆల్‌రౌండర్ ప్రదర్శన ముంబయి ఓటమికి కారణమైంది. అయితే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అంటే హర్షల్ పటేల్ హ్యాట్రిక్(Harshal Patel Hat Trick) వికెట్స్ అనే చెప్పుకోవాలి. 17వ ఓవర్లో హర్షల్ వరుస బంతుల్లో హార్దిక్(3), పొలార్డ్(7), రాహుల్ చాహర్(0)ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించడం ద్వారా బెంగళూరుకు విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో 18.1 ఓవర్లలో ముంబయి ఇండియన్స్ 111 పరుగులకు ఆలౌటైంది.
సీజన్‌లో తొలిబౌలర్గా..
ఐపీఎల్ 14వ సీజన్‌లో హ్యాట్రిక్(Harshal Patel Hat Trick) సాధించిన తొలి బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. హర్షల్ పటేల్‌కు ఐపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ ఇదే కావడం విశేషం. అదే విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున హ్యాట్రిక్(RCB Bowler Hat Trick) సాధించిన మూడో బౌలర్‌గా హర్షల్ పటేల్ అవతరించాడు. ప్రవీణ్ కుమార్, సామ్యూల్ బద్రీల తర్వాత హర్షల్ నిలిచాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3.1 ఓవర్ల బౌలింగ్ వేసి 17 పరుగులతో 4 వికెట్లు పడగొట్టాడు.