భుజం సమస్య కారణంగా బెంగుళూరుతో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్‌కు దిగలేదని వెల్లడించాడు ముంబయి ఇండియన్స్ క్రికెట్ డైరెక్టర్ జహీర్ ఖాన్. అయితే అతి త్వరలోనే అతడు తిరిగి బౌలింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు.
"లీగ్ మొత్తంలో హార్దిక్ ఎంత విలువైన ఆటగాడో మనందరికీ తెలుసు. పని ఒత్తిడి నిర్వహణలో భాగంగా తొలి మ్యాచ్‌లో అతడు బౌలింగ్‌కు దిగలేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బౌలింగ్ చేశాడు. చివరి వన్డేలో అయితే ఏకంగా 9 ఓవర్లు బంతిని విసిరాడు. హార్దిక్‌కు కొంచెం భుజం సమస్య ఉంది. కానీ, ఆందోళన చెందాల్సినంత పెద్దదేమీ కాదు. త్వరలోనే అతడు బౌలింగ్‌కు దిగుతాడు. బంతితోనూ అతడు రాణిస్తాడని నేను ఆశిస్తున్నాను" అని జహీర్ తెలిపాడు.
ఇదీ చదవండి:'ఐపీఎల్‌లోనూ దేశవాళీ ఫామ్‌ను కొనసాగిస్తా'