శనివారం(అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్లో చెన్నైని(CSK vs RR) అలవోకగా ఓడించింది రాజస్థాన్ రాయల్స్. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. అయితే.. ఈ పోరు జరుగుతుండగా ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.
17వ ఓవర్లో సామ్ కరన్(Glenn Phillips Sam Curran) వేసిన రెండో బంతి చేతినుంచి జారిపోయి వైడ్ దిశగా పైకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆ బంతిని కూడా ఉపయోగించుకోవాలని ప్రయత్నించాడు స్ట్రైక్లో ఉన్న గ్లెన్ ఫిలిప్స్(Glenn Philips IPL). వేగంగా పరుగెత్తినప్పటికీ ఆ బంతిని అందుకోలేకపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. విపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. 'ఏంటి ఫిలిప్స్ అంత దూరం వెళ్తున్న బంతిని కూడా విడిచిపెట్టవా..?' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... 'ఫిలిఫ్స్ ఆరాటం చూసి సామ్ కరన్ నోరెళ్లబెట్టాడు' అంటూ మరో నెటిజన్ స్పందించాడు.
ధనాధన్ ఛేదన..