సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు చెత్తగా వాగుతున్నారని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్(Maxwell IPL) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకరమైన విషయమని చెప్పిన అతడు(Maxwell News), 'మేమూ మనుషులమే కదా' అంటూ ట్విట్టర్లో భావోద్వేగ పోస్ట్ చేశాడు. తనను, తన జట్టు సభ్యులను విమర్శిస్తున్న వారిపై మండిపడ్డాడు.
"ప్రతిరోజు మా అత్యుత్తమ స్థాయిని కనబరిచేందుకు మేం ప్రయత్నిస్తుంటాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు హుందాగా ఉండేందుకు మీరూ ప్రయత్నించండి" అని తనపై విమర్శలు గుప్పిస్తున్నవారికి కౌంటర్ ఇచ్చాడు మ్యాక్స్వెల్(Maxwell News IPL). ఆర్సీబీకి అండగా నిలిచిన నిజమైన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
"ఆర్సీబీకి ఇదో గొప్ప సీజన్. కానీ, దురదృష్టవశాత్తు ఫైనల్ చేరుకునే అవకాశం కోల్పోయాం. సోషల్ మీడియాలో చాలామంది చెత్తగా వాగుతున్నారు. ఇది చాలా బాధాకరం. వాళ్లలా ఉండకండి."
-గ్లెన్ మ్యాక్స్వెల్, ఆల్రౌండర్.