Gill Sachin Relationship : శుభ్‌మన్ గిల్.. ఇప్పుడు ఏ క్రికెట్ అభిమానిని పలకరించినా చెప్పే పేరు ఇది. అంతలా తన మెరుపు ఇన్నింగ్స్‌తో క్రికెట్ లవర్స్‌ని ఆకట్టుకున్నాడు. శుక్రవారం రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 233 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన ముంబయి మొదటి నుంచే పేలవ ప్రదర్శన చేసి 171 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ప్రయత్నించినా.. టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. ఇక, గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌పై ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు.
Gill Sachin Daughter : మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్ స్టేడియం స్టాండ్స్‌లో మాజీ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌తో సీరియస్ డిస్కషన్ చేశాడు. కొద్ది సేపు సచిన్ ఇంటెన్స్‌గా ఏదో చెబుతుతుండగా.. గిల్ శ్రద్ధగా విన్నాడు. ప్రస్తుతం సచిన్ ముంబయి ఇండియన్స్ జట్టుకు మెంటర్‌గా ఉన్నాడు. అయితే వీరిద్దరు మాట్లాడుకున్న ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే, వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం వాళ్ల కథలు వారు అల్లేసుకుంటున్నారు. 'గిల్, సారా తెందూల్కర్ పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు'ని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో యూజర్ 'మామ అల్లుడు' అని కామెంట్ పెట్టాడు. ఆ ఫొటో షేర్ చేస్తూ 'వరల్డ్ కప్ గెలిస్తేనే పెళ్లి చేస్తా' అని సచిన్.. గిల్‌తో చెబుతున్నట్టు కామెంట్ చేశాడు.