రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం(Kohli RCB Captaincy) తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. టీ20 ప్రపంచకప్(ICC T20 Worldcup 2021) తర్వాత.. భారత జట్టు పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటానని ఇటీవల చెప్పిన విరాట్.. గతరాత్రి మరో బాంబ్ పేల్చాడు. ఆర్సీబీ సారథిగానూ తనకు ఈ సీజనే(IPL 2021) చివరిదని తెలిపాడు. కోహ్లీ నిర్ణయంపై గంభీర్(Gambhir on Kohli Captaincy) స్పందించాడు
"సరిగ్గా రెండో దశ ప్రారంభమైనప్పుడే కోహ్లీ ఇలా ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఒకవేళ కచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే టోర్నీ పూర్తయ్యాక చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పుడీ నిర్ణయం జట్టుపై ప్రభావం చూపుతుంది. కోహ్లీ కోసం ట్రోఫీ సాధించాలని ఆటగాళ్లపై ఒత్తిడి నెలకొంటుంది. ప్రస్తుతం ఆర్సీబీ చాలా మంచి స్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ నిర్ణయంతో వాళ్లను అనవసర ఒత్తిడికి గురిచేయడం ఎందుకు? నిజంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని భావిస్తే టోర్నీ పూర్తయ్యాక కూడా చెప్పొచ్చు."