పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి. శుక్రవారం రాత్రి కోల్‌కతాతో(KKR vs PBKS) తలపడిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (67; 55 బంతుల్లో 4x4, 2x6) చివరి వరకూ పోరాడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, 19వ ఓవర్‌లో అతడు కీలక సమయంలో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శివమ్ మావీ వేసిన 18.3 ఓవర్‌కు పంజాబ్ కెప్టెన్ భారీ షాట్ ఆడగా రాహుల్ త్రిపాఠి పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.
ఆ క్యాచ్‌పై అంపైర్లకు స్పష్టత లేకపోవడం వల్ల థర్డ్ అంపైర్‌కు నివేదించారు. అక్కడ పలుమార్లు రీప్లేలో చూసి చివరికి కేఎల్ రాహుల్(KL Rahul News) నాటౌట్ అని తేల్చారు. దీనిపై కోల్‌కతా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ విస్మయం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ థర్డ్ అంపైర్ నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు జట్లపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నాడు.