తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొత్త ఆటగాళ్లతో ఫ్రాంచైజీల్లో నూతనోత్సాహం

ఐపీఎల్ 14వ సీజన్​(ipl 2021 team list) రెండో దశ ఆదివారం (సెప్టెంబర్ 19) నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే పలు కారణాల వల్ల ఈ లీగ్​ నుంచి కొందరు ఆటగాళ్లు వైదొలిగారు. వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లను తీసుకున్నాయి ఫ్రాంచైజీలు(ipl 2021 player replacement). వారెవరో చూద్దాం.

By

Published : Sep 18, 2021, 7:18 PM IST

Updated : Sep 18, 2021, 7:47 PM IST

IPL 2021
ఐపీఎల్

ఐపీఎల్​ 14 సీజన్ రెండో దశ(ipl 2021 news) ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్​-ముంబయి ఇండియన్స్​(csk vs mi 2021) మధ్య సెప్టెంబర్ 19న జరిగే పోరుతో ఈ సెకండ్ ఫేజ్ మొదలుకానుంది. అన్ని జట్లు ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్​లో మునిగి తేలాయి.

అయితే ఈ మెగాలీగ్​కు కొంతమంది స్టార్​ ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీలకు షాక్​ ఇచ్చారు. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల, మరికొందరు గాయాల కారణంగా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వారి స్థానాల్లో మిగతా ప్లేయర్స్​కు అవకాశాలిచ్చాయి ఆయా జట్ల యాజమాన్యాలు(ipl 2021 player replacement). తాజాగా వీరి జాబితాను విడుదల చేసింది ఐపీఎల్ పాలకమండలి. ఇంతకీ వారెవరంటే?

వైదొలిగిన ఆటగాడు జట్టు భర్తీ చేసిన ఆటగాడు
ఎం సిద్దార్థ్ దిల్లీ క్యాపిటల్స్ కుల్వంత్ కేజ్రోలియా
క్రిసో వోక్స్ దిల్లీ క్యాపిటల్స్ బెన్ డ్వార్షిస్
మోహ్సిన్ ఖాన్ ముంబయి ఇండియన్స్ రూష్ కలారియా
రిలే మెరిడెత్ పంజాబ్ కింగ్స్ నాథన్ ఎల్లిస్
జే రిచర్డ్​సన్ పంజాబ్ కింగ్స్ అదిల్ రషీద్
డేవిడ్ మలన్ పంజాబ్ కింగ్స్ మర్క్​రమ్
ఆండ్రూ టై రాజస్థాన్ రాయల్స్ షంసీ
జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్ గ్లెన్ ఫిలిప్స్
బెన్ స్టోక్స్ రాజస్థాన్ రాయల్స్ ఒషానే థామస్
జాస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ ఎవిన్ లూయిస్
ఆడం జంపా ఆర్సీబీ వానిందు హసరంగ
డేనియల్ సామ్స్ ఆర్సీబీ దుష్మంత చమీరా
కేన్ రిచర్డ్​సన్ ఆర్సీబీ జార్జ్ గార్టోన్
ఫిన్ అలెన్ ఆర్సీబీ టిమ్ డేవిడ్
వాషింగ్టన్ సందర్ ఆర్సీబీ ఆకాశ్ దీప్
జానీ బెయిర్​స్టో సన్​రైజర్స్ హైదరాబాద్ షెర్ఫానే రూథర్​ఫోర్ట్

ఇవీ చూడండి: ముంబయిపై చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందా?

Last Updated : Sep 18, 2021, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details