రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు అభిమానులకు తెగ ఆనందాన్నిచ్చే వార్తే ఇది! గత నెలలో జరిగిన వేలంలో ఆర్సీబీకి ఎంపికైన ఫిన్ అలెన్.. టీ20ల్లోనే రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని గురువారం చేశాడు. బంగ్లాదేశ్‌తో మూడో మ్యాచ్ సందర్భంగా ఈ ఘనత అందుకున్నాడు. ఈ పోరులో కివీస్ జట్టు 65 పరుగుల తేడాతో గెలిచింది.
ఐపీఎల్: ఆర్సీబీకి కొత్త ఓపెనర్ దొరికేశాడు! - ఫిన్ అలెన్
ఆర్సీబీ త్వరలో ఆడనున్న కివీస్ క్రికెటర్ ఫిన్ అలెన్.. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై బెంగళూరు జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
![ఐపీఎల్: ఆర్సీబీకి కొత్త ఓపెనర్ దొరికేశాడు! Finn Allen scores second fastest T20I fifty for New Zealand, RCB fans react ahead of IPL 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11242025-906-11242025-1617283015765.jpg)
ఐపీఎల్: ఆర్సీబీకి కొత్త ఓపెనర్ దొరికేశాడు!
దీంతో బెంగళూరు జట్టుకు కొత్త ఓపెనర్ దొరికేశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీతో కలిసి అతడు ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఆర్సీబీ బృందం ప్రాక్టీసు చేస్తోంది. ఏప్రిల్ 9న మొదలయ్యే సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది.