IPL arjun tendulkar 2023 : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు.. 23 ఏళ్ల అర్జున్ తెందుల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన అతడు.. తన మొదటి మ్యాచ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చి పర్వాలేదనిపించాడు. అయితే అర్జున్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చే ముందు.. తండ్రి సచిన్ కుమారుడికి సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఆడుతున్న ఆట పట్ల గౌరవం, కష్టపడేతత్వం అలవాటు చేసుకుంటేనే విజయాలు సాధ్యం అవుతాయని అర్జున్‌కు సచిన్ చెప్పాడు. "అర్జున్ ఒక క్రికెటర్‌గా ఈ రోజు నీ జీవితంలో ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నావు. ఒక తండ్రిగా.. క్రికెట్ ప్రేమిడికుగా ఆనందిస్తున్నా. ఒక ప్లేయర్‌గా నువ్వు ఆడుతున్న ఆటను గౌరవిస్తే కచ్చితంగా నీవు తిరిగి అదే ప్రేమను పొందుతావు. నువ్వు ఈ స్థాయికి వచ్చేందుకు ఎంత కష్టపడ్డావో ఇకపై కూడా అంతే హార్డ్‌వర్క్ కొనసాగించు. ఇది నీ ప్రయాణానికి ఒక మంచి ఆరంభం. ఆల్ ది బెస్ట్" అని సచిన్ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు.
IPL arjun tendulkar 2023 : అర్జున్‌కు సచిన్ సలహా ఇదే - rohit sharma capped to arjun
IPL arjun tendulkar 2023 : ముంబయి-కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌తో ఎట్టకేలకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ అరంగేట్రం చేశాడు. ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. ఈ సందర్భంగా సచిన్.. తన కుమారుడు అర్జున్‌కు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. ఏమన్నాడంటే..
ఇకపోతే అర్జున్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలింగ్, ఎడమ చేతి వాటం బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్. 2021 ఐపీఎల్ వేలంలో 20 లక్షల బేస్ ప్రైస్‌కు ముంబయి ఇండియన్స్ అతడిని సొంతం చేసుకుంది. రెండేళ్లుగా డగౌట్‌కే పరిమితమైన అర్జున్ గత మ్యాచ్‌లో అరంగేట్రం చేయడం మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ రంగాన్ని శాసించిన సచిన్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎలా ఆడతాడా అని ఆసక్తిగా చూశారు. అయితే అర్జున్.. బౌలర్‌గా పర్వాలేదనిపించే ప్రదర్శన కనబరిచాడు. రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 17 పరుగులిచ్చాడు. కానీ వికెట్ తీయలేదు. తొలి ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చాడు. రెండో ఓవర్లో 13 పరుగులు సమర్పించుకున్నాడు. అర్జున్ బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ వరుసగా 4,6 బాదాడు. అయితే బ్యాటర్‌గా మాత్రం అతడికి అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ.. అతడి బౌలింగ్ ప్రదర్శన చూసిన అభిమానులు.. అతడు బ్యాటర్‌గా అవతారమెత్తడానికి పెద్దగా సమయం పట్టకపోవొచ్చని ఆశిస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి..ఐపీఎల్లో ఒకే జట్టు తరఫున ఆడిన తండ్రి, కుమారుల(సచిన్-అర్జున్) ద్వయంగా వీరిద్దరు ఘనత సాధించారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి సచిన్ తెందుల్కర్ ముంబయితోనే ఉన్నారు. 2008 నుంచి 2013 దాకా ఆరు సీజన్లలో ప్లేయర్‌గా అలరించారు. తన కెప్టెన్సీలో 2010లో జట్టును ఫైనల్స్‌కు తీసుకెళ్లారు. కానీ ఆ సీజన్లో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటినుంచి ముంబయి ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా సేవలు అందిస్తున్నాడు సచిన్.