ఐపీఎల్‌ను నిరుటిలాగే యూఏఈలో నిర్వహించాల్సిందని లీగ్‌ను వీడిన ఆడమ్ జంపా అన్నాడు. "ఈసారి బబుల్ కారణంగా హాని తప్పదన్న భయం కలిగింది. ఆరు నెలల కిందట దుబాయ్‌లో అలా అనిపించలేదు. ఈసారీ లీగ్‌ను అక్కడే నిర్వహించాల్సింది. నేను ఐపీఎల్‌ను వీడడానికి చాలా కారణాలున్నాయి. ఇక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. నాకు తుది జట్టులో ఆడే అవకాశం కూడా రావడం లేదు. బబుల్‌లో విసిగిపోయాను. భారత్ నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన రాగానే లీగ్‌ను వీడేందుకు ఇదే సరైన సమయం అనిపించింది" అని ఆడమ్ వివరించాడు.
ఐపీఎల్ కొనసాగించవచ్చు..
భారతదేశంలో కరోనా తీవ్రమవుతున్నందుకు బాధగా ఉందని ఇంగ్లాండ్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. అయితే వివిధ రాష్ట్రాలు కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధిస్తున్నా ఐపీఎల్ కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డాడు.