ఐపీఎల్ విషయంలో టీమ్ఇండియా అభ్యర్ధను ఇంగ్లాండ్ బోర్డు అంగీకరించి ఉండాల్సిందని ఆ దేశ మాజీ ఆటగాడు మార్క్ బుచర్ అభిప్రాయపడ్డాడు. ఐదు టెస్టుల సిరీస్ను వాయిదా వేసి, ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లను ఇంగ్లీష్ గడ్డపై నిర్వహించి ఉంటే బాగుండేదని అన్నాడు. తద్వారా భారత స్టార్ క్రికెటర్లు 'ద హండ్రెడ్' లీగ్లో ఆడే అవకాశం ఉండేదని చెప్పాడు.
ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్తో ఆ దేశంలో ఐదు టెస్టులు ఆడనుంది టీమ్ఇండియా. అయితే వాటిని వాయిదా వేసి, ఐపీఎల్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ కోరింది. కానీ ఈసీబీ(ECB) నుంచి ఎలాంటి స్పందన రాలేదు.