తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2021: ఆటగాళ్లపై ట్రోల్స్.. దినేశ్​ కార్తిక్ అసహనం - ఆర్సీబీ X కేకేఆర్

సోషల్​ మీడియాలో ఆటగాళ్లపై ట్రోల్స్​ చేయడంపై అసహనం వ్యక్తం చేశాడు కోల్​కతా నైట్​రైడర్స్​ ఆటగాడు దినేశ్ కార్తిక్(Dinesh Karthik News). ఐపీఎల్​ ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం పలువురు ఆర్సీబీ ఆటగాళ్లపై నెటిజన్లు ట్రోల్స్​ చేసిన నేపథ్యంలో కార్తిక్ స్పందించాడు.

dinesh karthik
దినేశ్ కార్తిక్

By

Published : Oct 13, 2021, 11:33 AM IST

ఆటగాళ్లపై ట్రోల్స్‌ వస్తుండడంపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik news) స్పందించాడు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో(IPL Eliminator Match) ఓటమి తర్వాత రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్(trolls on RCB) పట్ల కార్తిక్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లపై సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్న వారికి వాటి ప్రభావం గురించి తెలియడం లేదన్నారు. మీమ్స్‌, వీడియోలు, అసభ్యకర పదాల రూపంలో కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని, ఆ క్షణంలో వారి మనసులో ఏమనిపిస్తే దాన్ని పోస్ట్‌ చేస్తున్నారని తెలిపారు. అవి ఆటగాళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నాడు.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత బెంగళూరు ఆటగాళ్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, డేనియల్ క్రిస్టియన్‌, అతని భార్యపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు చేశారు. వీరికి కోల్‌కతా జట్టు అండగా నిలిచింది. "ఆటగాళ్లను ద్వేషించడం ఆపండి. ఇటీవల ఆటగాళ్లు ఆన్‌లైన్‌ వేదికగా తరచూ దూషణకు గురవుతున్నారు. ఈ చర్యలకు వ్యతిరేఖంగా బలంగా నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆటలో గెలుపోటములు అనేవి సహజం. మీకు అండగా మేమున్నాం అని ఆర్‌సీబీ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ" దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details