ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవధిక వాయిదాపై భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి స్పందించారు. లీగ్‌తో సంబంధమున్న ప్రతి ఒక్కరి సంక్షేమం తమకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీపడేది లేదని పేర్కొన్నారు.
"ఐపీఎల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి కలిసి ఏకపక్షంగా లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించాం. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది కొనసాగుతుంది. లీగ్‌తో సంబంధమున్న ఆటగాళ్లు, ఉద్యోగులు, గ్రౌండ్స్‌మెన్, మ్యాచ్ నిపుణులు.. ఇలా ప్రతి ఒక్కరి సంక్షేమం మాకు ముఖ్యమే. వీరి విషయంలో మేము రాజీపడబోం."
-జై షా, బీసీసీఐ కార్యదర్శి.