ముంబయి ఇండియన్స్(ipl mumbai vs punjab) మళ్లీ గెలిచింది. మంగళవారం రాత్రి పంజాబ్‌తో తలపడిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీనిపై స్పందించిన కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma ipl) ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య పరిస్థితులను అర్థం చేసుకొని ఆడాడని మెచ్చుకున్నాడు. మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడాడు.
'ఈ సీజన్‌లో మా శక్తిమేర రాణించలేదని ఒప్పుకొంటాం. ఇది అతిపెద్ద టోర్నీ. ప్రణాళికలకు కట్టుబడి ఉండాలి. మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఆత్వివిశ్వాసం పెరుగుతుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ ఆడిన తీరు, పరిస్థితులను అర్థం చేసుకున్న విధానం జట్టు కోణంలో ముఖ్యమైనవి. సౌరభ్ తివారీ కూడా బాగా ఆడాడు. ఇద్దరూ క్రీజులో నిలబడటం ఎంతో అవసరం. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టడం కఠిన నిర్ణయమే అయినా సానుకూలంగా ఉన్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో రాణిస్తాడనే నమ్మకం అతడికి ఉంది. అతడు మాకు ముఖ్యమైన ఆటగాడు.. జట్టు యాజమాన్యం అండగా ఉంటుంది' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.