తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL: ధోనీ ఫామ్​లోకి రావడం పక్కా: చాహర్ - Deepak Chahar dhoni ipl

నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్ (IPL)​ రెండో దశలో చెన్నై సూపర్​ కింగ్స్​ సారథి ధోనీ ఫామ్​లోకి వస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు ఆ జట్టు బౌలర్ దీపక్​ చాహర్​. మహీ నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నట్లు తెలిపిన అతడు.. ధోనీ (Dhoni) గొప్ప ఆటగాడని కితాబిచ్చాడు.

dhoni
ధోనీ

By

Published : May 27, 2021, 10:07 AM IST

చెన్నై సూపర్​ కింగ్స్​ సారథి ధోనీ ఈ ఐపీఎల్ (IPL 2021)​ రెండో దశలో తన బ్యాట్​కు పనిచెప్తాడని ధీమా వ్యక్తం చేశాడు ఆ జట్టు పేస్​ బౌలర్​ దీపక్ ​చాహర్​. రెగ్యులర్​ క్రికెట్​కు దూరమైన తర్వాత ఏ ఆటగాడైన ఫామ్​లోకి రావాలంటే కొంత సమయం పడుతుందని చెప్పాడు. ఈ సీజన్​ తొలి దశలో ఆడిన ఏడు మ్యాచ్​ల్లో మహీ 37 పరుగులు మాత్రమే చేశాడు.

"ఓ బ్యాట్స్​మన్​ 15-20ఏళ్లు ఒకేలా ఆడలేడు. అంతర్జాతీయ క్రికెట్​కు దూరమైన ప్లేయర్స్​.. ఐపీఎల్​ వంటి ఆటల్లో పాల్గొనడం, మునపటి ఫామ్​ను ప్రదర్శించడం అంత సులువు కాదు. దానికి కొంత సమయం పడుతుంది. కానీ మహీ రెగ్యులర్​ క్రికెట్ ఆడనప్పటికీ ఎప్పుడూ ఫినిషర్​ పాత్రను బాగా పోషించాడు. 2018-19 సీజన్​లో ధోనీ (Dhoni) భయ్యా నెమ్మదిగా తన స్థాయికి తగ్గట్లు ఆడటం ప్రారంభించాడు.. కానీ స్ట్రోక్​ ప్లే మాత్రం అద్భుతంగా ఆడాడు. కాబట్టి ఈ సీజన్​ రెండో అంకంలో అతడి ఉత్తమ ప్రదర్శన చూడొచ్చు" అని చాహర్ వెల్లడించాడు.

ధోనీ తనపై నమ్మకం ఉంచి స్ట్రైక్​ బౌలింగ్​ చేయడానికి అవకాశాలు ఇచ్చాడని తెలిపాడు చాహర్​. "సీఎస్కే(CSK)తో నా ప్రయాణం మొదలై ఇది నాలుగో సంవత్సరం. మహీ భయ్యా నాపై నమ్మకం ఉంచి బౌలింగ్​ చేయడానికి అవకాశాలు ఇచ్చాడు. నమ్మకం అనేది చాలా ముఖ్యం. అందుకే అతడు నాతో సహా ఎంతోమంది ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. పరిస్థితులకు తగ్గట్టు ఏ ఆటగాడిని ఎలా ఉపయోగించాలనేది ఓ సారథిగా మహీకి బాగా తెలుసు. అది అతడి సామర్థ్యం. అతడి నుంచి ఎన్నో మెళకువల్ని నేర్చుకున్నా" అని చాహర్​ వివరించాడు.

నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్​ (IPL14)ను యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 18 లేదా 19 తేదీలలో తిరిగి నిర్వహించనున్నట్లు ఓ బీసీసీఐ (BCCI) సీనియర్ అధికారి ఇటీవలే వెల్లడించారు. మొత్తంగా 10 రోజుల పాటు రెండేసి మ్యాచ్​లు జరుపుతారని సమాచారం.


ఇదీ చూడండి యూఏఈ వేదికగా సెప్టెంబర్ మూడో వారంలో ఐపీఎల్​!

ABOUT THE AUTHOR

...view details