ధోనీ(Dhoni retirement) అభిమానులకు శుభవార్త. ఈ దిగ్గజ ఆటగాడు మరో ఐపీఎల్ సీజన్ ఆడబోతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహి(MS Dhoni IPL).. ఈ ఏడాది టోర్నీతోనే ముగిస్తాడా అన్న అనుమానాలకు తెరదించుతూ వచ్చే సీజన్లో(Dhoni IPL 2021) తనను చూస్తారని.. తన వీడ్కోలు మ్యాచ్ ప్రియతమ చెన్నై స్టేడియంలోనే ఉంటుందని అతడు స్పష్టం చేశాడు. మంగళవారం ఓ ప్రైవేటు కార్యక్రమంలో అభిమానులతో మాట్లాడుతూ అతడిలా అన్నాడు.
"వీడ్కోలు మాటకు వచ్చేసరికి అది చెన్నైలోనే ఉంటుంది. ఘనంగా నన్ను సాగనంపేందుకు మీకు ఓ అవకాశం లభిస్తుంది. వచ్చే సీజన్లో చెన్నై వచ్చి నా చివరి మ్యాచ్‌లో అభిమానులను కలుసుకుంటానని ఆశిస్తున్నా" అని ధోనీ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి 'ఆగస్టు 15'ను మించిన రోజు మరొకటి తనకు కనిపించలేదని.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు మహి సమాధానంగా చెప్పాడు. వచ్చే ఐపీఎల్ మెగా వేలంలో చెన్నై జట్టు ధోనీతో పాటు రవీంద్ర జడేజా, ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లను తిరిగి దక్కించుకోనున్నట్లు తెలిసింది.