DELHI CAPITALS player covid: దిల్లీ క్యాపిటల్స్ జట్టు కరోనా హాట్‌స్పాట్‌గా మారింది! మరో ఆటగాడికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. పంజాబ్‌తో బుధవారం మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. యాంటీజెన్ పరీక్షలో న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్‌కు కరోనా వచ్చినట్లు నిర్ధరణ అయిందని సంబంధిత అధికారులు తెలిపారు. అతడి ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితం రావాల్సి ఉందన్నారు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఆరు కేసులు బయటపడగా.. అన్నీ దిల్లీ క్యాపిటల్స్‌కు చెందినవే కావడం గమనార్హం.
మరో దిల్లీ ఆటగాడికి కరోనా... పంజాబ్‌తో మ్యాచ్ డౌటే! - దిల్లీ క్యాపిటల్స్ కరోనా
DELHI CAPITALS player Covid: కరోనా కేసులు ఐపీఎల్‌ను కుదిపేస్తున్నాయి! దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన మరో ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. యాంటీజెన్ పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. దీంతో.. బుధవారం పంజాబ్‌తో జరగాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
IPL 2022 Covid: ఇదివరకు మిచెల్ మార్ష్, ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్ సహా ఏప్రిల్ 15 నుంచి 18 మధ్య ఆరుగురు కరోనాకు పాజిటివ్‌గా తేలారు. ఈ నేపథ్యంలోనే పుణెలో జరగాల్సిన మ్యాచ్‌ను ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో నిర్వహిస్తోంది బీసీసీఐ. అయితే, మరికొద్దిగంటల్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆటగాడు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీపీసీఆర్లోనూ సీఫెర్ట్‌కు పాజిటివ్‌గా తేలితే.. అతడిని ఐసోలేషన్‌కు తరలిస్తారు. అనంతరం, మిగితా ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహిస్తారు. గత ఐపీఎల్ సీజన్లోనూ సీఫెర్ట్ కరోనా బారిన పడటం గమనార్హం. ఐపీఎల్ నిబంధనల ప్రకారం కనీసం 12 మంది ఆటగాళ్లు(ఏడుగురు భారతీయులు) గేమ్‌కు అందుబాటులో ఉండాలి. లేదంటే మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేస్తారు.
ఇదీ చదవండి:కొవిడ్ దెబ్బ.. దిల్లీ, పంజాబ్ మ్యాచ్ వేదిక మార్పు