అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 167పరుగుల లక్ష్యాన్ని 17.4ఓవర్లలోనే ఛేదించింది. విజయంలో శిఖర్ ధావన్(69*), పృథ్వీ షా(39), బౌలర్ రబాడా 3 వికెట్లతో కీలక పాత్ర పోషించారు.
పంజాబ్‌పై దిల్లీ విజయం- పాయింట్ల పట్టికలో అగ్రస్థానం - పంజాబ్ కింగ్స్‌పై దిల్లీ క్యాపిటల్స్ విజయం
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. 14బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. అర్ధశతకంతో శిఖర్ ధావన్ రాణించగా.. రబాడా 3 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది దిల్లీ.
ఛేదన ప్రారంభించిన దిల్లీకి మంచి శుభారంభం దక్కింది. ఓపెనర్లుగా బరిలో దిగిన పృథ్వీషా(39, 4x03 6x3), శిఖర్ ధావన్(69*) ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయారు. అయితే ధాటిగా ఆడుతున్న వీరిద్దరినీ హర్‌ప్రీత్ బ్రార్ విడదీశాడు. ఏడో ఓవర్లో షాను ఔట్ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్(24).. రిలే బౌలింగ్‌లో మలన్ చేతికి క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. పంత్(14).. సిమ్రాన్(16*). ధావన్ చివరి వరకు క్రీజులో ఉండి జాగ్రత్తగా జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతోపాటే మళ్లీ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది దిల్లీ జట్టు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాట్స్‌మన్ తడబడుతూ ఆడారు. వారికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా బరిలో దిగిన ప్రభ్సిమ్రాన్(12) నాలుగో ఓవర్లోనే 17 పరుగులు వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. రబాడా బౌలింగ్‌లో క్యాచ్‌కు యత్నించి స్మిత్ చేతిలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్(13), డేవిడ్ మలన్(26), దీపక్ హోడా(1), షారుక్ ఖాన్(4), క్రిస్ జోర్డాన్(2) వరుసగా విఫలమయ్యారు. రెండో ఓపెనర్ మయాంక్(99) చివరి దాకా క్రీజులో నాటౌట్‌గా నిలిచి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది పంజాబ్. దిల్లీ బౌలర్లలో రబాడా 3, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ తలో వికెట్‌ను దక్కించుకున్నారు.