తెలంగాణ

telangana

ETV Bharat / sports

David Warner: ఐపీఎల్​ చరిత్రలోనే ఏకైక బ్యాటర్​గా వార్నర్ రికార్డు - పంజాబ్​ కింగ్స్​

David Warner: దిల్లీ క్యాపిటల్స్​ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఐపీఎల్​లో రెండు జట్లపై వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్​గా రికార్డు సృష్టించాడు.

DC vs KKR
David Warner

By

Published : Apr 29, 2022, 11:21 AM IST

David Warner: కోల్​కతా నైట్​రైడర్స్​తో గురువారం జరిగిన మ్యాచ్​లో 26 బంతుల్లోనే 42 పరుగులు చేసి దిల్లీ క్యాపిటల్స్​ విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించాడు విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఈ క్రమంలో అతడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్​లో రెండు జట్లపై (పంజాబ్, కేకేఆర్) వెయ్యికి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్​గా నిలిచాడు. పంజాబ్​ కింగ్స్​పై వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్​గా, కోల్​కతాపై వెయ్యి పరుగులు చేసిన రెండో బ్యాటర్​గా వార్నర్ కొనసాగుతున్నాడు.

వార్నర్

తొలి విదేశీ స్పిన్నర్​గా నరైన్ రికార్డు: దిల్లీతో మ్యాచ్​లోనే ఓ రికార్డును సాధించాడు కోల్​కతా ఆల్​రౌండర్ సునీల్ నరైన్. ఈ మ్యాచ్​లో తీసిన ఏకైక వికెట్​తో ఐపీఎల్​ చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి విదేశీ స్పిన్నర్​గా ఘనత దక్కించుకున్నాడు. ఐపీఎల్​లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో డ్వేన్ బ్రావో (181), లసిత్ మలింగ (170), అమిత్ మిశ్రా (166) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

నరైన్

దిల్లీతో జరిగిన మ్యాచ్​లో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది కోల్​కతా. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. అనంతరం దిల్లీ ఆరు వికెట్లను కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. డేవిడ్ వార్నర్ (42), లలిత్ యాదవ్ (22), రోవ్‌మన్ పావెల్ (33*), అక్షర్ పటేల్ (24) రాణించారు.

ఇదీ చూడండి:'సన్​రైజర్స్​లో కరవైంది దిల్లీలో.. అందుకే వార్నర్​ రెచ్చిపోతున్నాడు'

ABOUT THE AUTHOR

...view details