సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలిగించినా ఏ మాత్రం సహనం కోల్పోకుండా ఎంతో హుందాగా వ్యవహరించాడని ఆ జట్టు సహాయ కోచ్ బ్రాడ్ హాడిన్ చెప్పాడు. తనపై వేటు పడినా, జట్టు ప్రయోజనాల గురించే ఆలోచించాడని చెప్పాడు.
"వార్నర్‌ను తొలగించడం వల్ల ప్రతిఒక్కరూ షాక్ అయ్యారు. కానీ అతడు మాత్రం ఎంతో హుందాగా వ్యవహరించాడు. వరుస ఓటముల నేపథ్యంలో జట్టులో మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావించింది. ప్రమాణాలకు తగ్గట్టుగా ఆడటం లేదని కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే అతడి కెప్టెన్సీ నుంచి తప్పించారు. వార్నర్ దాన్ని చాలా సున్నితంగా తీసుకున్నాడు. త్వరలోనే మళ్లీ బరిలోకి దిగుతాడని భావిస్తున్నాను. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లరో తాను ఒకడు. బెంచ్ మీద కూర్చోవాల్సి వచ్చినా బాధపడకుండా ప్రతిఒక్కరికీ సలహాలు ఇచ్చాడు. డ్రింక్స్ మోసుకుంటూ పరుగులు తీశాడు. ఇప్పటికీ జట్టు సమావేశాల్లోనూ తనవంతుగా పాల్గొంటూ మాట్లాడుతున్నాడు. క్లిష్ట పరిస్థితులను అతడు వ్యవహరించిన తీరు అద్భుతం" అంటూ వార్నర్‌పై ప్రశంసలు కురిపించాడు.