తెలంగాణ

telangana

ETV Bharat / sports

David Warner News: 'టీమ్​లో ఇక ఆడకపోవచ్చు.. మద్దతివ్వండి' - డేవిడ్​ వార్నర్ వార్తలు

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్​మెన్ డేవిడ్ వార్నర్(David Warner News).. సన్​రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad News)​ ఫ్యాన్స్​కు షాక్ ఇచ్చాడు. ఐపీఎల్​లో ఇకపై ఎస్​ఆర్​హెచ్​ తుదిజట్టులో ఆడకపోవచ్చనే సంకేతాన్ని ఇచ్చాడు. దీంతో హైదరాబాద్​ టీమ్​ ఫ్యాన్స్​ నిరాశకు లోనయ్యారు.

David Warner
డేవిడ్ వార్నర్

By

Published : Sep 28, 2021, 10:38 AM IST

డేవిడ్ వార్నర్​.. ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరు. అయితే 2021 ఐపీఎల్​లో పేలవ ప్రదర్శనతో మొదటినుంచీ ఫ్యాన్స్​ను నిరాశపరుస్తున్నాడు. దీంతో వార్నర్​ను హైదరాబాద్​ జట్టు పక్కనపెట్టింది(Sunrisers Hyderabad News)​. ఐపీఎల్​లో సోమవారం రాజస్థాన్​ రాయల్స్​తో(Rajasthan Royals News) జరిగిన మ్యాచ్​లో వార్నర్​ కేవలం డ్రెస్సింగ్​ రూమ్​కే పరిమితమయ్యాడు. దీంతో అభిమానులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.

ఈ క్రమంలో వార్నర్​ గ్రౌండ్​లో కనిపించకపోవటంపై ఓ అభిమాని ట్విట్టర్​ ద్వారా సన్​రైజర్స్(Sunrisers Hyderabad News)​ అధికారిక ఇన్​స్టాగ్రామ్​ ఖాతాకు మెసేజ్ చేశాడు. వార్నర్ స్టేడియంలో ఉన్నాడా..? మాకు కనిపించటం లేదే..? అని పోస్ట్ చేశాడు. దీనిపై వార్నర్(David Warner News) కామెంట్​ రూపంలో సమాధానమిచ్చాడు.

"దురదృష్టవశాత్తు నేను ఇకపై జట్టులో ఉండకపోవచ్చు. అయినా నన్ను సపోర్ట్ చేయండి' అంటూ బదులిచ్చాడు. వార్నర్​ పోస్ట్​తో ఎస్​ఆర్​హెచ్​ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇదీ చదవండి:DC Vs KKR: కోల్​కతా ప్లేఆఫ్స్​ ఆశలను దిల్లీ ఆవిరి చేయనుందా?

ABOUT THE AUTHOR

...view details