దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన వార్నర్.. ఐపీఎల్లో 50వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా ఘనత వహించాడు.
ఇదీ చదవండి:'భారత్‌తో పోలిస్తే మాది చిన్న సమస్య'
ఈ మ్యాచ్‌లో రెండు బంతులను స్టాండ్స్‌లోకి పంపించిన వార్నర్.. మొత్తంగా ఐపీఎల్లో 200 సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. 55 బంతుల్లో 57 పరుగులు చేసి పెవిలియన్ చేరిన ఎస్ఆర్హెచ్ సారథి.. టీ20ల్లో 10వేల పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా నిలిచాడు. షోయబ్ మాలిక్, క్రిస్ గేల్(13,296 పరుగులు), కీరన్ పొలార్డ్(10,370 పరుగులు).. వార్నర్ కంటే ముందున్నారు.
ఇదీ చదవండి:రాణించిన మనీష్, వార్నర్.. చెన్నై లక్ష్యం 172