CSK Vs RCB: ఈ రికార్డులపై లుక్కేయండి గురు!
ఐపీఎల్ 2021(ipl 2021 live) రెండో దశలో భాగంగా నేడు (సెప్టెంబర్ 24) చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(csk vs rcb 2021) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
ఐపీఎల్ 2021(ipl 2021 live) రెండో దశలో భాగంగా నేడు (సెప్టెంబర్ 24) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది చెన్నై సూపర్ కింగ్స్(csk vs rcb 2021). ఇప్పటికే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న సీఎస్కే.. ఈ మ్యాచ్‌లో గెలిచి అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. కాగా, ఇప్పటివరకు ఒక్క టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ట్రోఫీపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ రేసుకు దగ్గరవ్వాలని చూస్తోంది. అయితే ఈ పోరులో(csk vs rcb 2021) పలు రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.
- సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీ(ms dhoni records in ipl) మరో రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో మరో రెండు క్యాచ్‌లు అందుకుంటే ఐపీఎల్(ipl 2021 live)లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఇతడు 114 క్యాచ్‌లతో ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 115 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే 114 క్యాచ్‌లు, 39 స్టంపౌట్లలో పాలుపంచుకున్న మహీ.. లీగ్‌లో అత్యధిక ఔట్లలో భాగమైన ఆటగాడిగా అగ్రస్థానంలో ఉన్నాడు.
- టీ20ల్లో విరాట్ కోహ్లీ(virat kohli records list in ipl) 10 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి మరో 66 రన్స్ దూరంలో ఉన్నాడు. ఇతడి ఖాతాలో ప్రస్తుతం 9,934 టీ20 రన్స్ ఉన్నాయి. ఇందులో టీమ్ఇండియా తరఫున 3,159 పరుగులు చేయగా.. ఐపీఎల్(ipl 2021 live)లో 6,081 రన్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెప్టెంబర్ 20న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చీప్‌గా ఔటైన విరాట్.. ఈ మ్యాచ్‌లో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
- ఆర్సీబీ విధ్వంసకర బ్యాట్స్‌మన్ డివిలియర్స్(de villiers ipl) ఐపీఎల్లో 250 సిక్సుల మైలురాయికి చేరువగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో 8 మ్యాచ్‌ల్లో 10 సిక్సులు బాదిన ఇతడు.. మరో 5 సిక్సులు సాధిస్తే ఈ మైలురాయిని చేరుకుంటాడు. 357 సిక్సులతో ఈ జాబితాలో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
- ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్(mohammed siraj ipl) ఐపీఎల్లో 50 వికెట్లు సాధించిన మైలురాయిని చేరుకునేందుకు దగ్గరగా ఉన్నాడు. ఇప్పటివరకు 43 ఐపీఎల్(ipl 2021 live) మ్యాచ్‌లాడిన ఇతడు 45 వికెట్లు సాధించాడు.
- సీఎస్కే సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా(suresh raina ipl runs) ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఇతడి ఖాతాలో 5,495 పరుగులు ఉన్నాయి. మరో 5 పరుగులు సాధిస్తే 5,500 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. కోహ్లీ (6,081), ధావన్ (5,619), రోహిత్ (5,513) ఇప్పటికే ఈ ఘనతను సాధించారు.