ముంబయి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తూ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
ధనా ధన్ చెన్నై.. కోల్‌కతా లక్ష్యం 221 - సీఎస్‌కే స్క్వాడ్ టుడే
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీసేన.. 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాట్స్‌మన్ ఫాఫ్ డుప్లెసిస్(95) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.
సీఎస్‌కే vs కోల్‌కతా
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేశారు. రుతురాజ్ గైక్వాడ్(64) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మొయిన్ అలీ(25) సునీల్ నరైన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆరంభం నుంచి అద్భుతమైన బ్యాటింగ్‌తో 60 బంతుల్లో 95 పరుగులు చేసి.. టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు.
ఇదీ చూడండి:కరోనా నుంచి కోలుకున్న కిరణ్ మోరే