ఐపీఎల్(IPL Final 2021) తుది పోరులో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు(CSK vs KKR 2021). సాయంత్రం ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
- మరికొద్ది గంటల్లో ఐపీఎల్ తుది పోరు ప్రారంభం కానుంది.
- చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్లో పోటీపడనున్నాయి.
- ఐపీఎల్లో సీఎస్కే ఫైనల్‌కు చేరడం ఇది తొమ్మిదో సారి. 2010, 2011, 2018 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచింది.
- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 2012, 2014లో ఫైనల్‌కు చేరి.. రెండుసార్లు విజేతగా నిలిచింది.
- ఈ సీజన్ లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లు గెలిచి పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-1లో దిల్లీని ఓడించి తుది పోరు అర్హత సాధించింది.
- కోల్‌కతా ఏడు మ్యాచ్‌లే గెలిచినప్పటికీ మంచి రన్‌రేట్‌తో, ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది.
- చెన్నైలో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ బాగా రాణిస్తున్నారు. ఓపెనర్లు రుతురాజ్, డుప్లెసిస్ నిలకడగా ఆడుతున్నారు.
- కోల్‌కతాలోనూ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ తిరుగులేని ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ జట్టుకు మంచి ఆరంభాన్నిస్తున్నారు.
- ఇరు జట్లకూ 'మిడిలార్డర్' సమస్యగా మారింది.
- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు స్పిన్ బౌలింగ్ ప్రధాన బలం. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(18), షకిబ్ అల్ హసన్, సునీల్ నరైన్(14) జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
- ఈ సీజన్లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 603 పరుగులు చేశాడు. మరో 24 పరుగులు చేస్తే.. కేఎల్ రాహుల్(626)ను అధిగమించి ఆరెంజ్ క్యాప్ అందుకుంటాడు.
- ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మూడు ట్రోఫీలు గెలిచింది. మరోసారి ట్రోఫీ గెలిస్తే.. అత్యధిక ట్రోఫీలు గెలిచిన రెండో జట్టు కానుంది. మరోవైపు కోల్‌కతా గెలిస్తే మూడు ట్రోఫీలు గెలిచి.. చెన్నైకి సమం కానుంది.
- అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా ముంబయి ఇండియన్స్ టాప్‌లో ఉంది. ఇప్పటివరకు ముంబయి జట్టు 5 ట్రోఫీలు నెగ్గింది.
- చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఇదీ చదవండి: