చెన్నై బౌలర్లు ఆకట్టుకున్నారు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లో (CSK Vs KKR) నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి మెప్పించారు. దీంతో అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో (CSK Vs KKR Live Score 2021) తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి కేకేఆర్ 171/6 చేసింది. రాహుల్ త్రిపాఠి అత్యధికంగా 45 పరుగులు చేశాడు.
CSK Vs KKR: రానా, రాహుల్ ధనాధన్.. చెన్నై లక్ష్యం 172 - csk vs kkr 1st innings
చెన్నై సూపర్‌కింగ్స్‌కు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కోల్‌కతా నైట్‌రైడర్స్ (CSK Vs KKR). ఈ మ్యాచ్‌లో గెలిస్తే చెన్నై.. మళ్లీ అగ్రస్థానానికి వెళ్తుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (IPL 2021 Live News) ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. ముందు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్.. ఈ పోరులో 18 పరుగులే చేసి ఔటయ్యాడు. మూడోస్థానంలో దిగిన రాహుల్ త్రిపాఠి చెన్నై బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొని స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. కానీ 45 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు.
మిగతా బ్యాట్స్‌మెన్‌లో (Kolkata Knight Riders) రసెల్ 20, మోర్గాన్ 8, దినేశ్ కార్తిక్ 26, నితీశ్ రానా 37 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో శార్దుల్, హేజిల్‌వుడ్ 2 వికెట్లు, జడేజా ఓ వికెట్ పడగొట్టాడు.
ఇదీ చూడండి:IPL 2021: బెంగళూరు-ముంబయి.. గెలుపుబాట పట్టేదెవరు?