ఐపీఎల్(IPL 2021) 14వ సీజన్ రెండో దశ కోసం దుబాయ్ వేదికగా ముంబయితో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతోంది. ఈ మేరకు గురువారం దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ ప్రారంభించింది సీఎస్కే.
చెన్నై, ముంబయి జట్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. "ఇరు జట్లు క్వారంటైన్ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేశాయి. శిక్షణ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. గురువారం రాత్రి దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీలో సీఎస్కే ట్రైనింగ్ ప్రారంభించింది. ముంబయి జట్టు షేక్ జయేద్ మైదానంలో శుక్రవారం నుంచి శిక్షణ ప్రారంభించనుంది" అని క్రికెట్ వర్గాలు తెలిపాయి.