CSK Runner Up Leak IPL 2023 Final : ఐపీఎల్ 16వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఒక్కటే మిగిలింది. ఆదివారం జరగాల్సిన ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. అయితే, అహ్మదాబాద్ నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో వర్షం పడినప్పుడు ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ తెరలపై ఓ సందేశం ప్రత్యక్షం అయింది. దానిపై 'చెన్నై సూపర్ కింగ్స్ రన్నరప్' అని రాసి ఉంది. దీంతో స్టాండ్లలో ఉన్న అభిమానులు దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది క్షణాల్లోనే ఆ ఫొటోల వైరల్ అయింది.
CSK Runner Up Photo : ఆ ఫొటోను చూసిన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ అయిపోక ముందే అలా ఎలా విన్నిర్, రన్నరప్‌ను డిసైట్ చేస్తారంటూ మండిపడ్డారు. ఐపీఎల్ 2023 ఫైనల్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, ఈ ఘటనపై మ్యాచ్ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. ఎల్ఈడీ స్క్రీన్‌ను పరీక్షిస్తుండగా ఇలా జరిగిందని వెల్లడించారు. అయితే ఇలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లకు ముందు ఇరు టీమ్‌లకు సంబంధించిన విన్నర్, రన్నరప్ డిక్లేరేషన్ బోర్డులను సంబంధిత విభాగం చెక్ చేస్తుందని తెలిపారు. 'రన్నరప్ సీఎస్‌కే' అనే కాకుండా, 'సీఎస్‌కే విన్నర్' అనే డిక్లేరేషన్‌ను కూడా పరీక్షించినట్లు తెలిపారు. ఇదే విధంగా గుజరాత్ విన్నర్, గుజరాత్ రన్నరప్ అనే డిక్లెరేషన్లు కూడా టెస్ట్ చేసినట్లు నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వివాదం కొంత మేర సద్దుమనిగినట్టైంది.