తెలంగాణ

telangana

ETV Bharat / sports

భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.. ఎందుకంటే? - భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.

చెన్నై సూపర్ కింగ్స్, కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య మ్యాచ్​కు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సీఎస్కే క్రికెటర్ రైనా.. హర్భజన్ పాదాలకు నమస్కరించడం నెట్టింట వైరల్​గా మారింది.

raina, bhajji
రైనా, భజ్జీ

By

Published : Apr 22, 2021, 4:37 PM IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆట ప్రారంభానికి ముందు సీఎస్కే ఆటగాడు సురేశ్ రైనా తన మాజీ సహచర క్రికెటర్ హర్భజన్ సింగ్​ పాదాలకు నమస్కరించాడు. భజ్జీ ఆశ్చర్యపోయి వెంటనే రైనాను పైకి లేపి కౌగిలించుకున్నాడు. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్​గా మారింది. ఇరువురి మధ్య ఆప్యాయత చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది వరకు చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు హర్భజన్. కానీ అనివార్య కారణాల వల్ల యూఏఈలో జరిగిన చివరి సీజన్​లో ఆడలేకపోయాడు. ఈ సీజన్​కు ముందు జరిగిన వేలంలో ఇతడిని సీఎస్కే వదులుకోగా.. కేకేఆర్​ 2 కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది.

ABOUT THE AUTHOR

...view details