టీమ్ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో(ఐపీఎల్) మరో రికార్డు సృష్టించాడు. లీగ్‌లో ఏ వికెట్ కీపర్‌కు సాధ్యం కానీ ఘనత వహించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా 150 ఓట్లలో పాలు పంచుకున్న కీపర్‌గా ఘనత వహించాడు. కేకేఆర్ బ్యాట్స్‌మన్ నితీశ్ రానా క్యాచ్ ఒడిసిపట్టడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.
చెన్నై సారథి ధోనీ ఖాతాలో మరో రికార్డు - ధోనీ ఐపీఎల్ క్యాచ్‌లు
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్లో మరో రికార్డు నెలకొల్పాడు. లీగ్‌లో 150 ఔట్లలో పాలుపంచుకున్న తొలి వికెట్ కీపర్‌గా ఘనత వహించాడు.
ధోనీ
ఐపీఎల్లో ఇప్పటివరకు 208 మ్యాచ్‌లాడిన ధోనీ 113 క్యాచ్లందుకోగా, 39 స్టంపింగ్‌లు చేశాడు. మహీ తర్వాత దినేశ్ కార్తీక్ 143 ఔట్లలో పాలుపంచుకుని తర్వాతి స్థానంలో నిలిచాడు.
కేకేఆర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ మూడు క్యాచ్‌లతో ఆకట్టుకున్నాడు.
Last Updated : Apr 23, 2021, 9:23 AM IST