Ruturaj Gaikwad Marriage : ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ పెళ్లిపీటలెక్కబోతున్నాడు. దేశవాళీ క్రికెట్లో దూసుకుపోతున్న మహిళా ఉత్కర్ష పవార్ క్రికెటర్‌ను వివాహమాడనున్నాడు. ఈ నెల 2,3 తేదీల్లో వీరిద్దరి వివాహం జరగనుంది. పూణెకు చెందిన ఉత్కర్ష పవార్.. ప్రస్తుతం మహారాష్ట్ర తరుఫున దేశవాళీ క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తోంది.
Ruturaj Gaikwad Wife : ఉత్కర్ష పవార్ 1998 అక్టోబర్ 13న మహారాష్ట్ర పుణెలో జన్మించింది. ఈమె తన 11 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. ప్రస్తుతం పూణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్‌నెస్ సైన్స్‌లో చదువుతోంది.
Ruturaj Gaikwad WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా క్రికెట్ కమిటీ అవకాశం ఇచ్చింది. కానీ, పెళ్లి కారణంగా ఈ మెగా ఫైనల్‌కు ఎంపిక చేసిన జట్టు నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించాడు. తన వివాహం ఉండటం వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉండనని గైక్వాడ్ ఇప్పటికే బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దీంతో ఇతడి స్థానంలో మరో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసింది బోర్డు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లితో కలిసి లండన్ వెళ్లిన అతడు ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్నాడు.