కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)ను తిరిగి యూఏఈ వేదికగా నిర్వహించాలని ఆ లీగ్ ఫ్రాంఛైజీలు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ను కోరాయి. గత మార్చిలో కరాచీ వేదికగా జరిగిన పీఎస్ఎల్.. పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల వాయిదా పడింది. అయితే టోర్నీ తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఓ పాక్ క్రీడాఛానెల్ వెల్లడించింది.
"అర్ధంతరంగా ఆగిపోయిన పీఎస్ఎల్ ఆరో సీజన్‌ను జూన్ 1 నుంచి జూన్ 20 వరకు తిరిగి నిర్వహించాలని ఫ్రాంఛైజీలు నిర్ణయించాయి. ఆ విషయమై పీసీబీకి ఓ లేఖను కూడా రాశాయని" ఓ క్రీడా ఛానెల్ నివేదించింది.