కొవిడ్‌తో పోరాడుతున్న భారతదేశానికి మద్దతు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. సత్వరమే రూ.37 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించింది. తమ దేశ ప్రజలు కూడా తమ వంతు సాయం చేయాలని కోరింది. దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న కరోనా రెండో దశపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
క్రికెట్ ఆస్ట్రేలియాతో పాటు ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్, యూనిసెఫ్ ఆస్ట్రేలియాలు విరాళాల సేకరణకు ముందుకు వచ్చాయి. దేశంలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు వైద్య పరికరాలు అందజేయనున్నట్లు యూనిసెఫ్ ఆస్ట్రేలియా తెలిపింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మద్దతు ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:కరోనాతో బీసీసీఐ మాజీ సెలెక్టర్ మృతి