ఐపీఎల్లో ఆడటానికి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు బెంగుళూరు ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్. దేశవాళీ ఫామ్‌ను ప్రస్తుత లీగ్‌లోనూ కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. మార్చి 22న కరోనా బారిన పడిన పడిక్కల్.. సీజన్ ప్రారంభానికి ముందు కోలుకున్నాడు. ఇటీవల తన సహచరులతో కలిసి సాధన కూడా మొదలెట్టాడు.
"కొవిడ్ అనేది ఒక ఎదురుదెబ్బ. అది రాలేదనే అనుకుంటున్నా. కానీ, దాని నుంచి బయటపడలేకపోయాను. నన్ను నేను ఫిట్‌గా ఉంచుకున్నాను. తిరిగి జట్టుతో కలిశాను. ఇప్పుడు లీగ్‌లో ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం నేను పూర్తి స్థాయిలో బాగున్నాను. బంతులను ఎదుర్కోగలుగుతున్నా. ఇది చాలా ముఖ్యమైనది. ప్రధానంగా ఐపీఎల్లో 100 శాతం సన్నద్ధంగా ఉండాలి. లేకుంటే మనల్ని మనం నిరూపించుకోలేము" అని పడిక్కల్ ఆర్సీబీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు.
ఇదీ చదవండి:నా ఫామ్ వెనుక కారణం అదే: పృథ్వీ షా
గతమెంతో ఘనం..
గత ఐపీఎల్ సీజన్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ(6 మ్యాచ్‌ల్లో 43.60 సగటుతో 218 పరుగులు), విజయ్ హజారే ట్రోఫీ(7 మ్యాచ్‌ల్లో 737 రన్స్)లో మంచి ప్రదర్శన చేశానని పడిక్కల్ తెలిపాడు. అదే ఫామ్‌ను ప్రస్తుత సీజన్లోనూ కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తాను బరిలోకి దిగిన ప్రతిసారి బ్యాటింగ్ పరంగా మెరుగవుతూనే ఉంటానని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి:'విలయమ్సన్‌కు ఇంకా సమయం పడుతుంది'
ముంబయితో తొలి మ్యాచ్‌లో స్థానం కోల్పోయిన పడిక్కల్ ఏప్రిల్ 18న జరిగే కోల్‌కతాతో మ్యాచ్ కోసం వేచి చూస్తున్నట్లు పేర్కొన్నాడు. అవకాశం వస్తే విరాట్‌తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడానికి సిద్ధమని తెలిపాడు. సీనియర్లతో కలిసి బ్యాటింగ్ చేయడం వల్ల తన పని సులువు అవుతుందని చెప్పాడు. వారి నుంచి వీలైనంత నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని వెల్లడించాడు.
కొవిడ్ కారణంగా ప్రస్తుత సీజన్‌కు అభిమానులను అనుమతించలేదు బీసీసీఐ. అయితే త్వరలోనే మంచి రోజులు వస్తాయని.. ప్రేక్షకులు తిరిగి స్టేడియాలకు రావాలని కోరుకుంటున్నట్లు పడిక్కల్ తెలిపాడు.
ఇదీ చదవండి:'ఫిట్నెస్తో శారీరక, మానసిక సమస్యలకు చెక్'