కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న దేశాన్ని ఆదుకునేందుకు పలువురు క్రీడా ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లోని అగ్రశ్రేణి ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ మంచి మనసు చాటుకుంది.
సీఎస్కే దాతృత్వం.. 450 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వితరణ - Chennai Super Kings corona donation
కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. ప్రాణవాయువు కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వానికి 450 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను వితరణ చేసింది.

సీఎస్కే
ప్రాణవాయువు కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న దృష్ట్యా 450 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను తమిళనాడు ప్రభుత్వానికి సాయం చేసింది. సీఎస్కే డైరెక్టర్ ఆర్.శ్రీనివాసన్ ఈ కాన్సన్ట్రేటర్లను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రూపా గురునాథ్ సమక్షంలో ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి స్టాలిన్‌కు అందజేశారు. భూమిక ట్రస్ట్ ద్వారా రెండు విడతలుగా సీఎస్కే వీటిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పంపిణీ చేయనుంది.
ఇదీ చూడండి: 'పీఎం కేర్స్'కు ఆసీస్ పేసర్ కమిన్స్ విరాళం