ఐపీఎల్లో(IPL 2021) మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా జరుగుతోన్న టోర్నీ రెండోదశలో ఇప్పటివరకు ఓటమిని ఎదుర్కొని రెండు టీమ్స్ ఇప్పుడు పోటీపడనున్నాయి. ఐపీఎల్లో ఆదివారం జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, కోల్కతా నైట్‌రైడర్స్(CSK Vs KKR) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు(IPL Playoffs 2021) చేరాలని ధోనీసేన.. అదే విధంగా వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో ఎగబాకాలని కోల్కతా సన్నాహాలు చేస్తున్నాయి.
చెన్నై కుర్రాడు చెలరేగుతాడా?
ఐపీఎల్ రెండో దశలో కోల్కతా నైట్‌రైడర్స్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ ఆశలు సజీవం చేసుకున్న కేకేఆర్.. ఈ మ్యాచ్‌లో నెగ్గి, పాయింట్ల పట్టికలో మరింత ముందుకెళ్లాలని ప్రణాళికలను రచిస్తుంది. అయితే బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్న చెన్నై కుర్రాడు వరుణ్ చక్రవర్తి.. తన హోమ్‌టీమ్ సీఎస్కేపై ఏవిధంగా చెలరేగుతాడు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టోర్నీలోనూ చెన్నై బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ వికెట్లను పడగొట్టాడు వరుణ్ చక్రవర్తి. అదే విధంగా ఈసారి సీఎస్కేపై వరుణ్ చక్రవర్తి విజృంభించే అవకాశం లేకపోలేదు.
వరుణ్ చక్రవర్తితో పాటు బౌలింగ్ దళంలో ఫెర్గ్యూసన్, ప్రసిధ్ కృష్ణ బలంగా కనిపిస్తున్నారు. బ్యాటింగ్ లైనప్‌లో ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. యువ బ్యాట్స్‌మన్ వెంకటేశ్ అయ్యర్ మరోసారి తన బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శన చేసే అవకాశమూ లేకపోలేదు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ త్రిపాఠి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
ఉత్సాహంలో సీఎస్కే