Bumrah Reprimanded: కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణాకు షాక్ తగిలింది. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ ఫీజులో అతడికి 10 శాతం జరిమానా విధించారు నిర్వాహకులు. మ్యాచ్ సందర్భంగా అతడు లెవల్-1 నేరానికి పాల్పడగా.. రాణా అంగీకరించినట్లు యాజమాన్యం తెలిపింది. ''కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణాను మందలించడం సహా మ్యాచ్ ఫీజులో 10 శాతం ఫైన్ విధించాం. ముంబయితో మ్యాచ్‌లో అతడు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు'' అని ఓ ప్రకటనలో వెల్లడించింది.
ముంబయి ఇండియన్స్ సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను రిఫరీ మందలించి వదిలేశారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనే ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని బుమ్రా ఉల్లంఘించినట్లు బీసీసీఐ తెలిపింది. బుమ్రా కూడా తన నేరాన్ని ఒప్పుకున్నాడని, కానీ అతడికి ఎలాంటి జరిమానా పడలేదని పేర్కొంది. ప్రవర్తనా నియమావళికి సంబంధించి లెవల్-1 ఉల్లంఘనలు రిఫరీ చేతుల్లో ఉంటాయి. తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీదే. గురువారం ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో గెలిచింది.